తమిళనాడు కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న లాంగ్వేజ్ వార్ ఇవాళ పార్లమెంట్‌ను కుదిపేసింది. త్రిభాషా విధానం పేరుతో బలవంతంగా హిందీని తమపై రుద్దితే సహించేది లేదంటూ తమిళనాడు కొంతకాలంగా అభ్యంతరం చెబుతోంది. National Education Policy పై పార్లమెంట్‌లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. తమిళనాడులో అధికార పార్టీ అయిన DMK విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని, వాళ్లు అప్రజాస్వామికంగా అనాగరికంగా (Uncivilised) గా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.వచ్చే ఏడాది ఎన్నికలకు డీఎంకేకు ఓ ఎమోషనల్ స్లోగన్ కావాలి. అందుకే హిందీని వాడుకుంటున్నారు అని విమర్శించారు. ఇదే వివాదానికి దారి తీసింది.